విదేశీ విమాన సర్వీసులు ఎప్పుడంటే....!

విదేశీ విమాన సర్వీసులు  ఎప్పుడంటే....!

దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. మరి అంతర్జాతీయ సర్వీసులు ఎప్పుడు?. అందరి మదిలో ఇదే ప్రశ్న. ఇటీవల వరకూ ఆగస్టు కంటే ముందు విదేశీ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అసలు విషయం చెప్పేశారు. ఆయా దేశాలు తీసుకునే నిర్ణయాలపైనే విదేశీ విమాన సర్వీసుల ప్రారంభం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి దేశీయ సర్వీసులు పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి హర్దీప్ సింగ్ పూరి శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో భారత్ మార్చి 22 నుంచి విదేశీ విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ ఏ దేశానికి సర్వీసులు ప్రారంభించాలన్నా ఆయా దేశాలు అందుకు అనుమతించాల్సిందే. అప్పటి వరకూ ఈ సర్వీసులు ప్రారంభించేందుకు వేచిచూడాల్సిందే.

దీనికి ఆయా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం అత్యంత కీలకంగా మారనుంది. అమెరికాతోపాటు బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, యూఏఈ, సింగపూర్ దేశాల్లో విమానాల ప్రవేశంపై ప్రస్తుతం ఆంక్షలు ఉన్నాయని..ఈ దశలో సాదారణ సర్వీసులు నడపటం సాధ్యం కాదన్నారు. దీంతో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ వందే భారత్ మిషన్ కింద 2.75 లక్షల మందిని భారత్ కు తీసుకొచ్చినట్లు తెలిపారు. డిమాండ్ ను బట్టి దేశీయ రూట్లలో విమాన సర్వీసుల సంఖ్యను పెంచటానికి తాము రెడీగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

Similar Posts

Recent Posts

International

Share it