ఆసియా లోనే అద్భుత రోడ్ జర్నీగా మారబోతుందా?!

ఆసియా లోనే అద్భుత రోడ్ జర్నీగా మారబోతుందా?!

ఇండియా నుంచి ప్రతి ఏటా పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్లే ప్రాంతాల్లో బ్యాంకాక్ (థాయిలాండ్ ) ఒకటి అనే విషయం తెలిసిందే. ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అలాంటి కీలక పర్యాటక ప్రాంతం అయినా బ్యాంకాక్ కు కోల్‌కతా నుంచి రోడ్డు మార్గం అందుబాటులోకి రానుంది. ఆసియాలోని రెండు ప్రముఖ నగరాలూ అయినా బ్యాంకాక్, కోల్‌కతా ల మధ్య రోడ్డు మార్గం రానుండటంతో రెండు దేశాల మధ్య సంబంధాలను కూడా మరింత పెంచే అవకాశం ఉంది అని అధికారులు చెపుతున్నారు. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆర్థిక ప్రగతి తో పాటు, సామజిక ప్రగతి సాదించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ బిమ్స్‌టెక్ లో భాగంగా ఈ రోడ్డు ప్రాజెక్ట్ చేపడుతున్నారు.

ఇది మూడు నుంచి నాలుగేళ్లలో అందుబాటులోకి రానుంది. ఏ హై వే మొత్తం నిడివి 2800 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్డు బ్యాంకాక్ నుంచి స్టార్ట్ అయి ప్రధాన నగరాలు అయిన సుఖోతాయి, మే షొత్ ల మీదుగా మయన్మార్ లోకి ప్రవేశిస్తుంది. ఆ దేశంలోని కొన్ని కీలక ప్రాంతాలను దాటి ఇండియా లోని మొరెహ్ , కోహిమా, గువాహటి, శ్రీరాంపూర్, సిలిగురి ల నుంచి కోల్‌కతా లోకి ప్రవేశిస్తుంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ఇది ఆసియాలోని అన్ని రహదారి ప్రయాణాల్లో ఇది ఒక అద్భుతంగా నిలుస్తుంది అని చెపుతున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it