ఆదోని కోట

ఆదోని కోట

కర్నూలు జిల్లా ఆదోనికి సమీపంలో ఒక కొండపైన ఉన్న శిథిలమైన పురాతన కోట ఇది. ఇది సుమారు 3000 సంవత్సరాల చరిత్ర కలిగిన కోట. కాలక్రమంలో ఇది విజయనగర రాజులు, గోల్కొండ, బీజాపూర్ సుల్తానులు, ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ నుంచి చివరకు ఆంగ్లేయుల చేతుల్లోకి వచ్చింది. ఈ ప్రాంతం ద్వాపర యుగంలో యదువంశ మూల పురుషుడు యయాతి-దేవమానిల (శుక్రాచార్యుల) పుత్రిక యదు పేరుతో యదుపురం యాదవ అవనిగా ప్రఖ్యాతమైంది. తదనంతరం 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు పరిపాలించారు. దీనిని క్రీ.పూ 1200 శతాబ్దంలో చంద్రసేనుడు అనే రాజు కట్టించినట్లుగా తెలుస్తోంది.

దీనిని యాదవగిరి అనే పేరుతో నిర్మించారు. తరువాత మధ్యయుగంలో విజయనగర రాజుల చేతికి వచ్చి క్రీ.శ 14 నుంచి 16 వ శతాబ్దం మధ్యలో బాగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. వారి తరువాత ఇది ఆదిల్ షాహీ వంశానికి చెందిన గోల్కొండ , బీజాపూర్ సుల్తానులకు గట్టి కోటగా భాసిల్లింది. 1690 లో దీన్ని ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. 18 శతాబ్దం చివరి నాటికి మైసూరు రాజుల చేతికి, 1785లో టిప్పు సుల్తాన్ చేతికి, చివరకు 1799 లో ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది. యాదవగిరి 800 నుండి 900 అడుగుల ఎత్తు వుండి 48 నుంచి 50 కిలోమీటర్ల చుట్టు కొలతలో కోట నిర్మాణమైంది. మొదట 7 వృత్తాల కోటగోడలు వుండి బారాకిల్లా అనే పేరుతో 12 కోటలుండేవి. శతృవులు చొరబడలేని విధంగా చక్రవ్యూహంగా కనిపించేంది. కోట వైశాల్యం 3583 ఎకరాలు, కోటగోడల మందం 25 నుండి 35 అడుగుల ఉండేది.

Similar Posts

Recent Posts

International

Share it