తొలి విమానం ఎగిరింది ఎక్కడికో తెలుసా?

తొలి విమానం ఎగిరింది ఎక్కడికో తెలుసా?

రెండు నెలల విరామం తర్వాత భారత్ లో విమానాలు గాల్లోకి లేచాయి. లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు విమాన సర్వీసులను ఆపేసిన సంగతి తెలిసిందే. పలు ఆంక్షల నడుమ దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రయాణికులు విమానాశ్రయాలకు చేరుకుని జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలకు రెడీ అయ్యారు. అయితే దేశంలో తొలి విమానం మాత్రం ఢిల్లీ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 4.45 గంటలకు పూణేకు బయలుదేరి వెళ్లింది. ఇదే లాక్ డౌన్ తర్వాత బయలుదేరిన తొలి ప్యాసింజర్ ప్లైట్. ముంబయ్ విమానాశ్రయం నుంచి తొలి విమానం 6.45 గంటలకు పాట్నాకు బయలుదేరి వెళ్లింది. అదే సమయంలో సోమవారం నాడు పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు అయిన ముంబయ్, చెన్నయ్, కలకత్తా విమానాశ్రయాల్లో ప్రయాణికుల విమానాలను అనుమతించేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. దీంతో ముంబయ్, చెన్నయ్ లకు కేవలం నామమాత్రంగానే సర్వీసులు నడిపారు. కోల్ కతా లో మాత్రం మే 28 తర్వాతే సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో కూడా మంగళవారం నుంచే విమాన సర్వీసులకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. దీంతో ఎన్నో ఉత్కంఠతల మధ్య విమాన సర్వీసులు సోమవారం నాడు ప్రారంభం అయ్యాయి.

Similar Posts

Recent Posts

International

Share it