విమాన ప్రయాణికులు ఫోటోలు..వీడియోలు తీసుకోవచ్చు

విమాన ప్రయాణికులు ఫోటోలు..వీడియోలు తీసుకోవచ్చు

విమానయాన నియంత్రణా సంస్థ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమాన ప్రయాణికులు ఫోటోలు..వీడియాలు తీసుకొనే అంశంపై క్లారిటీ ఇఛ్చింది. కంగనా రనౌత్ వ్యవహారంతో తొలుత ఓ సర్కులర్ జారీ చేసిన డీసీజీఏ ఏరోడ్రోమ్స్ తోపాటు విమానాల్లో ఫోటోలు..వీడియోలు వీడియో తీయటం నిషేధం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై ఒకింత గందరగోళం నెలకొనటంతో దానికి కొనసాగింపుగా క్లారిటీ ఇఛ్చింది. విమాన ప్రయాణికులు ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చని పేర్కొంది. అయితే దీనికి రికార్డు చేసే పరికరాలు ఉపయోగించకూడదని పేర్కొంది. మీడియాను దృష్టిలో ఉంచుకునే ఈ ‘రికార్డింగ్’ అనే పదాన్ని వాడినట్లు స్పష్టం అవుతోంది. '

రికార్డింగ్ పరికరాలు వాడటం వల్ల విమానయాన సేవలకు ఆటంకం కలగటంతోపాటు గందరగోళం నెలకొంటుందని పేర్కొన్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ చండీఘడ్ నుంచి ముంబయ్ కి వచ్చిన విమానంలో ఓ మీడియా ప్రతినిధి విమానంలో షూట్ చేయటంతో పాటు ఓ మైక్ పట్టుకుని నిలబడటం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో రావటంతో దుమారం చెలరేగింది. అందుకే డీజీసీఏ దీనిపై తొలుత ఓ సర్కులర్ జారీ చేసింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ అందులో మార్పులు చేసింది. ఇలా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు వారాల పాటు ఆ రూటులో సర్వీసులను సస్పెండ్ చేస్తామని ఇండిగో ఎయిర్ లైన్స్ ను హెచ్చరించారు.

Similar Posts

Recent Posts

International

Share it