గాల్లో తేలుకుంటూ..ఇక వైఫై వాడుకోవచ్చు

గాల్లో తేలుకుంటూ..ఇక వైఫై వాడుకోవచ్చు

ప్రస్తుతం భారత్ లో విమానం ఎక్కిన వెంటనే సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేయాలి లేదంటే ఫ్లైట్ మోడ్ లో అయినా పెట్టుకోవాలి. ఇది నిబంధన. ఇక నుంచి ఎంచక్కా వైఫై సేవలు వాడుకుంటూ ప్రయాణికులు తమకు కావాల్సిన పనులు చేసుకోవచ్చు. భారత గగనతలంలో కూడా ఇక నుంచి విమానాల్లో వైఫై సేవలు వాడుకునేందుకు అనుమతిస్తూ పౌరవిమానయాన శాఖ మార్చి 2న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం విదేశాల్లోని పలు ఎయిర్ లైన్స్ ఈ సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు అవి భారత్ లోనూ అందుబాటులోకి వచ్చినట్లు అయింది. గాల్లో ఎగురుతున్న విమానంలోనై ఇంటర్నెట్ సేవలు పొందేందుకు వీలుగా ఫ్లైట్ ఇన్ కమాండ్ అనుమతించవచ్చని తాజా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ప్రయాణికులు తమ ల్యాప్ టాప్, స్మార్ట్ వాచ్, ఈ-రీడర్ వంటి ఉపకరణాలను ఫ్లైట్ మోడ్ లో ఉంచుకుని ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చని తెలిపారు.

విమానయాన సంస్థలు ఇందుకు అనుగుణంగా తమ విమానాల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయించాల్సి ఉంటుంది. అయితే భారత్ లో ఈ సేవలు అందించే తొలి ఎయిర్ లైన్ గా విస్తారా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి కారణం ఈ కంపెనీ గత శుక్రవారం నాడే కొత్తగా బోయింగ్ 787-9 విమానాన్ని పొందింది. ఇదే విమానంలో ఇన్ ఫ్లైట్ వైఫై సేవలు అందిస్తామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. పలు చర్చల అనంతరం దేశీయ టెలికం శాఖ ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది.

Similar Posts

Recent Posts

International

Share it