అయినవిల్లి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామం. కోనసీమగా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామం పరిసర ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి.కోబ్బరి తోటలు, గోదావరి నది ఒడ్డు, పచ్చని పొలాలు, కాలువలతో ఈ ప్రాంతం మదిని దోచేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ప్రాంతం దేవాలయాలు ఉండడానికి చాలా అనువైన ప్రదేశం. ఎందుకంటే ఈ ప్రదేశం పర్వతశ్రేణులు, నదులు కలుస్తున్న స్థలం. వరసిద్ధి వినాయక దేవాలయం చాలా ప్రసిధ్ది చెందినది. ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు.స్వయంభు వినాయక క్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వాసం. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. మరొక కథనం అనుసరించి వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభ సమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని, ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు.

ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనది స్థలపురాణం వివరిస్తుంది. పూర్వం అయినవిల్లిలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతూ వుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని 14వ శతాబ్దంలో శంకరభట్టు రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొన్నారు. ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడనీ తరువాతి కాలంలో వారే మూగ, చెవిటి, గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భావాన్ని గుర్తించారని స్థలపురాణం వివరిస్తుంది.సువిశాలమైన ఆవరణలో ఎతైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాలయంలో శ్రీవిఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు.సాధారణంగా ప్రతీ దేవాలయం తూర్పుముఖంగా ఉంటుంది. అయితే అయినవిల్లిలో సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం విశేషం.

కోరింగ వన్యప్రాణి అభయారణ్యం

Previous article

ఇస్కాన్ టెంపుల్‌

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *