శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది సముద్ర మట్టంనుండి సగటున 41 మీటర్లు (137 అడుగులు) ఎత్తులో ఉంటుంది.సోంపేట, ఇచ్ఛాపురం అనే రెండు పట్టణాల మధ్యలో కవిటి ఉన్నది. ఈ మండలంలో ఈ ప్రాంతాన్ని వాడుకలో ‘‘ఉద్దానం’’ (ఉద్యానవనం)అంటుంటారు. తీరానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం కొబ్బరితోటలు, జీడిమామిడి తోటలు, పనస తోటలతో కనులకింపుగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సీతారామస్వామి దేవాలయం, చింతామణి అమ్మవారి దేవాలయం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. సముద్రతీరంలో ఉండే ఇసుకలో పర్యాటకులు సేదతీరుతారు.పలు రకాల చెట్లు ఈ ప్రాంతం ప్రత్యేకత. దీనికి మరో ‘కోనసీమ’ అనే పేరు కూడా ఉంది.
శ్రీకాకుళానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.