విమానం ఎక్కాలంటే ‘ఆ యాప్’ ఉండాల్సిందే!

విమానం ఎక్కాలంటే ‘ఆ యాప్’ ఉండాల్సిందే!

దేశీయ విమాన ప్రయాణం కోసం మామూలుగా అయితే టిక్కెట్ ఉంటే చాలు. కానీ ఇప్పుడు సీన్ మారింది. టిక్కెట్ ఉన్నా సరే..ఆరోగ్యసేతు యాప్, పేస్ కవర్, మాస్క్ లేకుండా విమాన ప్రయాణం అనుమతించబోరు. అంతే కాదు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోతేనే విమానంలోకి అనుమతిస్తారు. విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేస్తారు. ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కొత్త ప్రయాణికులకు ఎంతో ఉత్సాహంగా..రెగ్యులర్ ట్రావెల్స్ కు రొటీన్ గా ఉండేది. కానీ ఇఫ్పుడు ఎవరైనా సరే విమానం ఎక్కాలంటే బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ ప్రయాణం చేయాల్సిందే. మంగళవారం నుంచి ప్రయాణికులతో కూడిన ప్రత్యేక రైళ్ళు పరుగులు పెట్టనున్నాయి. ఇక త్వరలోనే దేశీయ విమానయానాన్ని కూడా పరిమిత సంఖ్యలో అనుమతించేందుకు ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి.

దీని కోసం డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బృందాలు సంయుక్తంగా దేశంలోని పలు కీలక విమానాశ్రయాల్లో కరోనా అనంతర పరిస్థితులు..విమానాశ్రయాల సన్నద్ధతను పరిశీలించాయి. తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమానయానం భవిష్యత్ లో ఇలా ఉండబోతుందని వ్యాఖ్యానించారు. ఈ ఫోటో వైరల్ గా మారింది. కరోనా దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న రంగాల్లో పౌరవిమానయాన రంగం కూడా ఒకటి.

Similar Posts

Recent Posts

International

Share it