ఈ ఆలయంలోకి వెళ్లే వరకూ తెలియదు అక్కడి ప్రత్యేకత.ముఖ్యంగా కొత్త వాళ్ళు అయితే ఆ ఆలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రత్యేక అనుభూతి పొందుతారు. ఎందుకంటే అమ్మవారి ఆలయానికి ముందు ఓ పెద్ద చెరువు ఉండటం ఆహ్లాదం కలిగిస్తుంది.కాకతీయుల కాలం క్రీ.శ. 942లో భధ్రకాళి ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా కేంద్రంలో ఉండే ఈ భద్రకాళి ఆలయం నిత్యం భక్తులు..పర్యాటకులతో కళకళలాడుతుంది. కాకతీయులు భద్రకాళిని తమ కులదైవంగా కొలిచేవారని చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా ఇక్కడ చండీహోమం నిర్వహిస్తారు. గురుపూర్ణిమ రోజు అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలకరించి పూజలు చేస్తారు. విజయదశమి సందర్భంగా దేవీ నవరాత్రోత్సవాలు..తెప్పోత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాలను చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ దేవాలయంలో భద్రకాళీదేవి విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు..తొమ్మిది అడుగుల వెడల్పుతో కన్నులపండువుగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తుంది. అమ్మవారు ప్రేతాసనాసీనయై ఉంది. ఆమె 8చేతులతో – కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, ఛురిక, జపమాల,డమరుకము , ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలము,ఛిన్నమస్తకము, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంటుంది.

సందర్శన సమయం: ఉదయం 4.00 గంటల నుంచి

రాత్రి 8.30 గంటల వరకూ)

రామప్ప దేవాలయం

Previous article

పాకాల సరస్సు

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Telangana