ప్రకృతి రమణీయతకు..శిల్పకళా నైపుణ్యానికి ఈ భైరవకోన ఓ నిదర్శనం.ఈ భారీ కొండపై భైరవుని విగ్రహం ఉండటం వల్లే ఈ ప్రాంతానికి భైరవకోన అనే పేరు వచ్చింది. ఎత్తైన కొండ ప్రాంతం, జలపాతాలను తలపించే సెలయేరు..కొండపై నుంచి పడే నీళ్ళు పర్యాటకులకు వినూత్న అనుభూతిని మిగుల్చు తాయి. కొండపై ఒక్క భైరవుని విగ్రహమే కాకుండా.. అనేక దేవాలయాలు ఉన్నాయి. ప్రకాశం-–నెల్లూరు జిల్లా సరిహద్దులో తూర్పు కనుమల మధ్య లోయలో భైరవకోన క్షేత్రం ఉంది.కొండల నడుమ కొలువుదీరి ఉన్న దేవాలయాలు అన్నీ ఒక సమూహంగా ఉంటాయి. ఇవి మహాబలిపురంలో పల్లవులు నిర్మించిన దేవాలయాల శిల్పకళా నైపుణ్యానికి దగ్గర పోలికలు కలిగి ఉంటాయి.పల్లవుల శిల్పకళను వివరించే కీలక ప్రదేశం భైరవకోనగా చెబుతారు.దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే క్షేత్రంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకం.

భైరవకోనలో ఎనిమిది హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మరో ప్రత్యేక ఆకర్షణ భైరవకోనలోని సుందర జలపాతం. ఎత్తైన కొండలపై ఉన్న లింగాల దొరువు నుంచి ప్రవహించి 200 మీటర్ల ఎత్తు నుంచి పడుతూ ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు ఈ దృశ్యాన్ని తిలకించటానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. జలపాతం నుంచి పడే నీటిలో అనేక మూలికలు, ఖనిజ లవణాలు ఉంటాయని.. ఈ నీరు తాగితే చాలా రోగాలు నయం అవుతాయని ఆ ప్రాంత వాసులు నమ్ముతారు.

 

కొత్తపట్నం బీచ్

Previous article

కొండవీడు

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *