విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో బొర్రా గుహలు ఒకటి. ఇవి విశాఖపట్నం, అనంతగిరి కొండల ప్రాంతంలో సముద్రమట్టం కంటే 800 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ బొర్రా గుహలకు మతపరమైన..చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. స్థానిక గిరిజనులు శివలింగంతోపాటు కోమండూను కూడా కొలుస్తారు.కోమండూ హిందూ పురాణాలలో దేవతగా పరిగణిస్తారు. ఈ దేవత విగ్రహాన్ని బొర్రా గుహల లోపలి భాగంలో ప్రతిష్టించారు. గుహల్లో రాళ్ళ గమనం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 1807వ సంవత్సరంలోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ గుహలను గుర్తించింది. వీటికి పది లక్షల సంవత్సరాల చరిత్ర ఉంటుందని అంచనా వేస్తున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలను 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. ఒరియా భాషలో ‘బొర్ర’ అంటే రంధ్రమని అర్థం. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియమ్ బై కార్బోనేట్‌తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంత రాయంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గుహలు ఏర్పడతాయి. కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఆంత్రోపాలజిస్టులకు మధ్యరాతియుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి50,000 సంవత్సరాల క్రితం నాటి రాతిపనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానువులు నివసించినట్లు తెలుస్తోంది. స్థానిక గిరిజనులు బొర్రాగుహలను ‘బోడో దేవుడి’ (పెద్ద దేవుడు) నివాసంగా నమ్ముతుంటారు. గుహల్లోపల ఆధునిక దీపాలంకరణ చేయటం, గుహ లోపలి వింత వింత ఆకారాలపై,రాళ్ళపై రకరకాల రంగులు, నీడలు పడేవిధంగా ఆధునిక దీపాలంకరణ చేసి పర్యాటకులను మరింత ఆకర్షించే చర్యలు తీసుకున్నారు. ప్రకృతిలో మనిషికి అర్ధంకాని వింతలెన్నోఉన్నాయి, ఎన్నో అద్భుతాలున్నాయి.ఇలాంటి అద్భుతాల్లో సహజసిద్ధమైన బొర్రాగుహలు కూడా ఒకటి. తూర్పుకనుమల్లోని ఆ ప్రదేశం నిజంగా చూసి తీరవలసిన ప్రదేశం.  ప్రకృతి ప్రసాదించిన వింత ఇది. తూర్పుకనుమల్లోని అనంతగిరిమండలంలో విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. విశాఖపట్నం నుంచి అరకులోయక ప్రయాణమే ఓ గొప్ప అనుభూతి. గుండెలు గుభేలు మనిపించే కొండదారిలో వెళ్తుంటే కింద పచ్చని తివాచీ పర్చినట్లు ప్రకృతి,దట్టమయిన అడవులు, అందమైన వన్యప్రాణులు కనిపిస్తాయి. బొర్రాగుహలను సందర్శించాలంటే,విశాఖపట్నం నుంచి బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేక వాహనాల్లో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు.విశాఖ నుంచి బొర్రా గుహల వరకు చేసే రైలు ప్రయాణం మరిచిపోలేని అనుభూతులతో కూడిన యాత్ర. రైలు దాదాపు 40 గుహల ద్వారా ప్రయాణిస్తుంది. వీటిలో కొన్ని ఒక కిలోమీటరు పొడవు కూడా ఉన్నాయి. ఈ గుహలు కాక అందమైన లోయల గుండా, పచ్చని పర్వతాల మీదుగా, జలపాతాల పక్కన రైలు ప్రయాణం సాగుతుంది. బస్సు, ఇతర వాహనాల ద్వారా చేసే ప్రయాణం కూడా అందమైన అనుభూతిగా మిగిలి పోతుంది. ఇక్కడ చాలా సినిమాల చిత్రీకరణ జరిగింది.

  • వైజాగ్‌ నుంచి90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అరకు

Previous article

తోటపల్లి

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *