జులై 31 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

జులై 31 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జులై 31 వరకూ పొడిగించారు. ఈ మేరకు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. అయితే ఎంపిక చేసిన రూట్లలో మాత్రం సర్వీసులను అనుమతించే అవకాశం ఉంది. తొలుత అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జులై 15 వరకూ మాత్రమే అని ప్రకటించారు. ఇప్పుడు నిర్ణయాన్ని మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పలు దేశాలు సరిహద్దులను ఓపెన్ చేస్తున్నాయి.

ఆగస్టు నాటికి పలు దేశాలు పర్యాటకులకు కూడా గేట్లు తెరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ కార్గో తోపాటు ముందుగా అనుమతి పొందిన విమానాలను కొన్ని రూట్లలో మాత్రమే రాకపోకలకు అనుమతిస్తామని వెల్లడించింది. మే 6 నుంచి వందే భారత్ మిషన్ కింద ఎయిర్ ఇండియాతో సహా పలు ప్రైవేట్ ఎయిర్లైన్స్ అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి. మే 25 నుంచి దేశీయ విమానయాన సర్వీసులను నడిపేందుకు డీజీసీఏ అనుమతిచ్చింది.

Similar Posts

Recent Posts

International

Share it