మే 15 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం!

మే 15 నుంచి దేశీయ  విమాన సర్వీసులు ప్రారంభం!

మే 15కు ముందే దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ దిశగా చర్యలు ప్రారంభించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇది చాలా సవాళ్లతో కూడిన అంశం కాబోతుందని ఆయన ‘ఔట్ లుక్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ లాక్ డౌన్ సమయంలో దేశంలో కేవలం మూడు నుంచి నాలుగు ప్రధాన విమానాశ్రయాలు అడపాదడపా కార్యకలాపాలు నిర్వహించటం మినహా మిగిలిన విమానాశ్రయాలు దీనికి సిద్ధం కావాల్సి ఉందని అన్నారు. అంతే కాకుండా దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు అన్నీ కూడా రెడ్ జోన్ లోనే ఉన్నాయని..ఈ నగరాల్లో ప్రజా రవాణా పరిస్థితిని కూడా మదింపు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రజా రవాణా త్వరలో ప్రారంభం కానుందని సంకేతాలు ఇఛ్చారు. ఇప్పుడు పౌరవిమానయాన శాఖ మంత్రి కూడా ఇదే మాట చెప్పారు. త్వరలోనే ప్రజా రవాణా, దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విమాన సర్వీసులు ప్రారంభం అయినా కూడా చాలా కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయని చెబుతున్నారు. అయితే ఇన్ని ఆంక్షల మధ్య ఎంత మంది విమానయానం వైపు మొగ్గుచూపుతారనే భయం ఎయిర్ లైన్స్ లో ఉంది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు అయిన ఢిల్లీ, హైదరాబాద్ మాత్రం లాక్ డౌన్ అనంతరం విమాన సర్వీసులు ప్రారంభించేందుకు వీలుగా ఇఫ్పటికే రెడీ అయ్యాయి.

Similar Posts

Recent Posts

International

Share it