దేశీయ విమానాలకూ నో ఛాన్స్..మరోసారి నిరాశే

దేశీయ విమానాలకూ నో ఛాన్స్..మరోసారి నిరాశే

ఈ సారి లాక్ డౌన్ మినహాయింపుల్లో దేశీయ విమాన సర్వీసులకు అనుమతి వస్తుందని అందరూ ఆశించినా నిరాశే ఎదురైంది. కేంద్రం తాజాగా మే 31 వరకూ లాక్ డౌన్ ను పొడిగించింది. ఇందులో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించారు. కేవలం దేశీయంగా వైద్య సేవల కోసం వాడే విమానాలను మాత్రమే అనుమతిస్తారు. మైట్రో రైలు సర్వీసులు కూడా ఇప్పట్లో తెరుచుకోవు. కేంద్ర హోం శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల్లో ఈ విషయాలను స్పష్టం చేశారు.

అయితే ఎప్పటి నుంచి విమాన సర్వీసులను అనుమతిస్తారో స్పష్టం చేయలేదు. దేశంలోని పలు విమానాశ్రయాలు భౌతిక దూరం పాటించటంతోపాటు ప్రయాణికుల రక్షణకు సంబంధించి పలు ఏర్పాట్లు చేసినా కూడా ఊరట లభించలేదు. దీంతో ప్రయాణికులకు తీవ్ర నిరాశే ఎదురైందని చెప్పొచ్చు. ఈ లెక్కన మే 31 తర్వాత మాత్రమే దేశీయ విమాన సర్వీసులకు ఛాన్స్ ఉండే అవకాశం కన్పిస్తోంది.

Similar Posts

Recent Posts

International

Share it