ఆంధ్రప్రదేశ్ ఊటీ హార్స్ లీ హిల్స్. వేసవిలో హాయిగా సేదతీరేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లలేని వారికి హార్స్ లీ హిల్స్ ఓ అనువైన, అద్భుతమైన ప్రదేశం. పచ్చదనం పరుచుకున్నట్లుగా ఉండే ఈ ప్రాంతం చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇది సముద్ర మట్టానికి సుమారు 1265 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చేరువలో హార్స్ లీ హిల్స్ ఉంటుంది. ఇక్కడ వేసవిలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీలు మాత్రమే. హార్స్ లీ హిల్స్ అందాలు పర్యాటకులను మరో లోకంలోకి తీసుకు వెళతాయి. ఎటుచూసినా పచ్చటి కొండలు మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. బ్రిటిష్ కాలంలో కడప  జిల్లా కలెక్టర్ గా పనిచేసిన డబ్ల్యు. డి . హార్స్ లీ ఈ ప్రాంతాన్ని 1840-43మధ్యకాలంలో సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలకు ఆకర్షితుడై ఈ ప్రాంతాన్ని తన వేసవి విడిదిగా చేసుకున్నాడు.

తదనంతర కాలంలో అతని పేరుపై ఈ ప్రాంతం ‘హార్స్ లీ హిల్స్’ గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ప్రదేశాన్ని చేరుకునే రహదారి మార్గం నిండా యూకలిప్టస్ చెట్లు, గంధం చెట్లు, వివిధ వర్ణాల పూల చెట్లతో ఎంతో రమణీయంగా వుంటుంది. గంగోత్రి సరస్సు, మల్లమ్మ గుడి, గాలిబండ,రిషివ్యాలీ స్కూల్, హార్స్ లీ హిల్స్ మ్యూజియం ఇక్కడి ముఖ్యమైన సందర్శక ప్రాంతాలు. జోర్ఫింగ్, ట్రెక్కింగ్ లాంటి సాహస క్రీడలకు కూడా ఈ ప్రదేశం పేరుగాంచింది.

హార్స్ లీ హిల్స్ కు వచ్చే పర్యాటకులకోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పున్నమి హోటల్ నిర్వహిస్తోంది. 

హార్స్‌లీ హిల్స్‌ రిసార్ట్‌ నెం. 099516 11040

 

తలకోన జలపాతం

Previous article

శ్రీహరి వాసం…. తిరుమల క్షేత్రం

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *