International Flights

దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్రం త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ బుధవారం నాడు ఈ అంశంపై ట్వీట్ చేశారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకు మేము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లుత తెలిపారు. పరిస్థితి కొంచెం సాధారణ స్థితికి చేరుకోగానే అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభిస్తామన్నారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు విదేశాల నుంచి వచ్చే పలువురికి తాత్కాలిక వీసాలు మంజూరు చేయటానికి రెడీ అయింది. దీని కోసం తాజాగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా వైద్యరంగ సంబంధిత నిపుణులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వారిలో హెల్త్‌ కేర్‌ నిపుణులు, పరిశోధకులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరు సడలింపులు పొందేందుకు మొట్టమొదట ఆయా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ లేదా రిజిస్టర్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వాన పత్రం పొందవలసి ఉంటుంది.

విదేశాల్లో వ్యాపారం నిర్వహిస్తూ భారతదేశానికి రావాలనుకుంటున్న ఇంజనీరింగ్‌, మేనేజిరియల్‌, డిజైన్‌ సంబంధిత అధికారులను కూడా పరిమిత సంఖ్యలో అనుమతించడంపై నిర్ణయం తీసుకుంది. ఇందులో ఉత్పత్తి సంస్థలు, డిజైనింగ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌, ఐటీ యూనిట్లు, బ్యాంకింగ్‌, నాన్‌ బ్యాంకింగ్‌ సెక్టార్‌ రంగాలలో పనిచేస్తున్న వారికి అనుమతులు ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే వ్యాపారవేత్తలు స్పెషల్‌ పర్మిట్‌ బిజినెస్‌ వీసాపై మాత్రమే నాన్‌షెడ్యూల్‌ కమర్షియల్‌, చార్టడ్‌ విమానాల్లో వచ్చేందుకు అనుమతులు ఉంటాయి. భారతదేశంలో ప్రముఖ బిజినెస్‌ సంస్థలు విదేశీ సాంకేతిక నిపుణులను ఆహ్వానించడానికి అనుమతులు ఇచ్చింది. విదేశీ మూలం యంత్రాలు, పరికరాల సౌకర్యాలకు, మరమ్మత్తు, నిర్వహణ కోసం విదేశీ ఇంజనీర్లను దేశానికి రప్పించవచ్చని తెలిపారు.

ముంబయ్ విమానాశ్రయం మూసివేత

Previous article

సెప్టెంబర్ వరకూ ఎతిహాద్..ఎమిరేట్స్ వేతనాల కోత

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Latest News