దట్టమైన చెట్లు..అటవీ జంతువులతో కవ్వాల్ అభయారణ్యం సందడి సందడిగా ఉంటుంది. జన్నారం మండలంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అభ యారణ్యాన్ని పులుల సంరక్షణా కేంద్రంగా ప్రకటించింది. ఇందులో 89,223 హెక్టార్లు కోర్ ఏరియాగా, 1,11,968 హెక్టార్లను బఫర్ ఏరియాగా ప్రకటించారు. కవ్వాల్ అభయారణ్యం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో గల తాడోబా పులుల సంరక్షణా కేంద్రాన్ని ఆనుకుని ఉండటం..ఇక్కడి ప్రాంతం పులుల సంరక్షణకు అనుకూలంగా ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కవ్వాల్ అభయారణ్యంలో ఐదు నుంచి 77 వరకూ పెద్ద పులులు ఉన్నట్లు గుర్తించారు.పులులే కాకుండా ఈ అరణ్యంలో వివిధ రకాల జంతు సంపద ఉంది. కవ్వాల్ పులుల సంరక్షణా కేంద్రంలో మొత్తం 11 బేస్ క్యాంప్ లు పనిచేస్తున్నాయి. 893 కిలోమీటర్ల మేర వ్యాపించిన ఈ మనోహరమైన అభయారణ్యం టేకు చెట్లతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలోని దొంగపల్లి, అలినగర్ ల్లో కొత్తగా నిర్మించిన వాచ్ టవర్ల ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయ అందాలను వీక్షించవచ్చు.

(జన్నారంలో హరిత రిసార్ట్ సదుపాయం ఉంది.)

 

కడెం డ్యామ్

Previous article

సంజీవయ్య పార్కు

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Adilabad