కర్నూలు పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది కొండారెడ్డి బురుజే. అచ్యుత దేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కర్నూలులో 16వ శతాబ్దంలో కట్టించిన కోట. ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే దొంగను అక్కడ బంధించడం వల్ల అది కొండారెడ్డి బురుజుగా పేరు గాంచింది. విజయనగర సామ్రాజ్య పాలకులు ఒక యుద్ధ తంత్రంగా శత్రువులను గమనించేందుకు ఈ బురుజును ఎత్తుగా నిర్మించారు. కర్నూలు పట్టణం నుండి 52 కి.మీ ఉన్న గద్వాల్ వరకూ ఈ బురుజు నుండి సొరంగ మార్గం ఉంది. ముస్లిం దురాక్రమణదారుల నుండి తప్పించుకొనటానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాదీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని వినికిడి. 1901లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసింది.

నల్లమల అడవులు

Previous article

మంత్రాలయం

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *