కూచిపూడి అంటే ఆంధ్రుల శాస్త్రీయ కళారూపం. ప్రఖ్యాత భారతీయ నృత్యరీతి కూచిపూడి నృత్యం పుట్టింది ఈ గ్రామంలోనే. కూచిపూడి నాట్య ఆద్యులు శ్రీ సిద్ధేంద్రయోగి, ఈ గ్రామంలో మాఘ శుద్ధ ఏకాదశి రోజున జన్మించారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో సాంప్రదాయ నాట్య కుటుంబాలకు చెందిన నాట్యాచార్యులు, మాఘ శుద్ధ ఏకాదశినాడు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆ రోజున మేళతాళాలతో వేదమంత్రాలతో ఊరేగింపు నిర్వహిస్తుంటారు.

సిద్ధేంద్ర యోగి ప్రారంభించి విస్తరించిన ఈ రీతి కూచిపూడి ప్రాంతంలో శతాబ్దాల కాలాన్ని అధిగమించి ఇప్పటికీ పరంపరగా వస్తున్న కళగా నిలిచింది.కూచిపూడి నాట్యరీతి, కూచిపూడి భాగవతుల ప్రశస్తి వంటివి 1500ల నాటికే ఉన్నట్టు మాచుపల్లి కైఫీయతు వల్ల తెలుస్తోంది. క్రీ.శ 1685లో కూచిపూడి భాగవతులు గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా వినోదం కోసం ప్రదర్శించిన భామాకలాపం ప్రదర్శనకు ముగ్దుడై 600ఎకరాల విస్తీర్ణం గల మాగాణి భూమిని ఆయన ఫర్మానంగా రాసి గౌరవించారని చెబుతారు. కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలంలో ఈ గ్రామం ఉంటుంది.

విజయవాడకు 51 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

 

హంసలదీవి

Previous article

పెనుగంచిప్రోలు

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *