మహేంద్రగిరులు

మహేంద్రగిరులు

ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది ఈ ప్రాంతం. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతాలు మహేంద్రగిరులు. ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులో ముడుత పర్వతాలుగా ఇవి వరసగా ఉంటాయి. పచ్చని చెట్లు.. గలగలపారే సెలయేర్లతో ఈ గిరుల ప్రాంతం వీక్షకులకు కనువిందు చేస్తుంది. అంతేకాదు ఇక్కడ రకరకాల పక్షులు, వన్య, క్రూరమృగాలను చూడొచ్చు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 4500 అడుగులు ఎత్తులో ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా సరిహద్దులో 26 కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం విస్తరించి ఉంటుంది. ఈ పర్వతాలకు ఎవర్ గ్రీన్ అనే మరో పేరూ ఉంది.పురాణాల్లో వీటిన దండకారణ్యంగా చెబుతారు. ఈ అడవుల్లోనే పాండవులు వనవాసం చేశారనేది పురాణగాథ.

Similar Posts

Recent Posts

International

Share it