మెదక్ ‘ఖిల్లా’

మెదక్ ‘ఖిల్లా’

కాకతీయ సామ్రాజ్యంలో చివరి పాలకుడు అయిన రెండవ ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. పాలనా వ్యవహారాల కోసం కాకుండా రక్షణ అవసరాల కోసం ఈ కోటను నిర్మించారు. దీనిని సైనిక దుర్గంగా వినియోగించినట్లు కోట నిర్మాణ తీరుతెన్నులను చూస్తే అర్థం అవుతుందని చరిత్రకారుల వాదన. పూర్తిగా కోట పైభాగానికి చేరుకోవాలంటే మొత్తం ఏడు ద్వారాలు దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది.కోట చివరన ఉన్న మసీదుపై కులీకుత్ బ్ షాహీలకు చెందిన చిహ్నాలు ఉన్నాయి. మెదక్ పట్టణంలోని పడమర దిక్కున సహజసిద్ధంగా ఏర్పడిన ఎత్తైన గుట్టపై ఉన్న ఈ కోట అతి పురాతన కట్టడం. కోటలోని ప్రధాన మార్గం కాకతీయుల చిహ్నమైన రెండు తలల గండబేరుండంతో కూడుకుని ఉంటుంది.

ఈ కోట చారిత్రక పరంగానేకాక పురావస్తు పరంగాకూడా గుర్తించదగినది. స్థానిక ప్రజల హృదయాలలో ఇది ఒక గర్వించదగిన స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం ఈ కోటలో 17వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన ఒక ఫిరంగి ఉంది. ఈ కోట నుండి పర్యాటకులు సుందర దృశ్యాలతో పాటు మెదక్ పట్టణాన్ని పూర్తిగా స్పష్టంగా చూడవచ్చు. దక్షిణాపథంపై ఖిల్జీలు, తుగ్లక్కుల చీకటి నీడలు పడుతున్న వేళ కాకతీయ సామ్రాట్టు రెండో ప్రతాపరుద్రుడు తన రాజ్య రక్షణ కోసం నిర్మించిన కోట ఇది. ఈ కోట నిర్మాణానికి ఎంచుకున్న స్థలమే ఈ కోటను శత్రుదుర్భేద్యంగా మార్చేసింది. ఎత్తైన కొండ, చుట్టూ నలభై కిలోమీటర్ల వరకూ ఎలాంటి కదలికలున్నా పసిగట్టేందుకు బురుజులు కోట ఎక్కడానికి వీల్లేనంత ఎత్తైన గోడలు, మలుపులు,మెలికలు తిరిగే కొండదారి దీన్ని శత్రుదుర్భేధ్యంగా మార్చాయి.

హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం

సందర్శన వేళలు: ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00గంటల వరకూ

Similar Posts

Recent Posts

International

Share it