ఎడారి దేశంలో ఇది ఓ అద్భుత పూలవనం. దుబాయ్ లోని ‘మిరాకిల్ గార్డెన్ చూసిన వారెవరైనా వావ్..అంటూ ఆశ్చరపోవాల్సిందే. 2013 సంవత్సరంలో వాలంటైన్ డే రోజు ఈ గార్డెన్ ను ప్రారంభించారు. 50 మిలియన్ల పూలతో ప్రపంచంలోనే అతి పెద్ద సహజమైన పూల గార్డెన్ గా ఇది. మిరాకిల్ గార్డెన్ లో పూలతో అలంకరించిన ‘ఎమిరేట్స్’ ఫ్లైట్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. దుబాయ్ ను సందర్శించే పర్యాటకులు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే. అక్టోబర్ నుంచి ఏప్రిల్ నెల వరకూ మాత్రమే ఇది తెరిచి ఉంటుంది.

మే నుంచి సెప్టెంబర్ కాలంలో మిరాకిల్ గార్డెన్ ను మూసివేస్తారు. కారణం ఈ సమయంలో ఉండే అధిక వేడి. మిరాకిల్ గార్డెన్ లోనే బట్టర్ ఫ్లై గార్డెన్ కూడా ఉంటుంది. ఈ పూలవనంలో ప్రత్యేకతలో ఎన్నో. దుబాయ్ ల్యాండ్ జిల్లాలో ఈ మిరాకిల్ గార్డెన్ ఉంటుంది. ఈ మిరాకిల్ గార్డెన్ లో పూలవనాలను రక్షించేందుకు రోజుకు 7,57,082 లీటర్ల నీటిని వినియోగిస్తారంటే ఇది పెద్దగా ఉంటుందో ఊహించుకోవచ్చు. నిరుపయోగం ఉన్న నీటిని శుద్ధి చేసి ఈ గార్డెన్ కోసం వాడతారు.

బుర్జ్ ఖలీఫా

Previous article

బాలీవుడ్ పార్క్స్ , దుబాయ్

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *