‘మాస్క్’ పెట్టుకోలేదని విమానం వెనక్కి

‘మాస్క్’ పెట్టుకోలేదని విమానం వెనక్కి

కరోనా కారణంగా విమాన ప్రయాణం తీరే మారిపోయింది. విమానం ఎక్కాలంటే ఎవరైనా మాస్క్ లు పెట్టుకోవాలి..ఫేస్ షీల్డ్ లు కట్టుకోవాలి. వీటికి తోడు ఎవరి జాగ్రత్తలు వాళ్లవి. భారత్ లో అయితే విమానం ఎక్కే ముందే మాస్క్ నిబంధన అమలు చేస్తున్నారు. అయితే లండన్ వెళ్ళే విమానంలో మాస్క్ కు సంబంధించి ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయ్యాక ఓ ప్రయాణికుడు మాస్క్ ధరించటానికి నిరాకరించాడు. అతని పక్కన కూర్చోవటానికి భయపడిన ప్రయాణికులు..విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయినా సరే ఆ ప్రయాణికుడు మాస్క్ పెట్టుకోవటానికి నో చెప్పటంతో విషయాన్ని పైలట్ కు తెలియజేసి ఏకంగా గాల్లోకి ఎగిరిన విమానాన్ని వెనక్కి మళ్ళించారు.

మాస్క్ పెట్టుకోవటానికి నిరాకరించిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాక విమానం తిరిగి గాల్లోకి ఎగిరింది. ఈ ఘటన లండన్ కు వెళ్లే విమానంలో జరిగింది. టర్కీలోని అంట్యాల విమానాశ్రయంలో ఎక్కిన 32 సంవత్సరాల ప్రయాణికుడు ఈ ఘటనకు కారకుడు అయ్యాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా కోస్ ఐలాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించని ప్రయాణికుడిని దించేసి వెళ్లిపోయింది. పలు దేశాలు విమాన ప్రయాణికులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it