ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెంబర్తికి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం జిల్లాల పునర్విభజన తర్వాత జనగాం జిల్లాలోకి వెళ్ళింది. ఇది వాస్తవానికి ఓ మారుమూల ప్రాంతం. పెంబర్తి గ్రామం ప్రపంచం అబ్బురపడే కళాఖండాలు, ఇత్తడి వస్తువులు, లోహ సామగ్రి, ఇత్తడితో చేయబడ్డ పరికరాల తయారీలో ఎంతో పేరుగాంచింది.ఇక్కడి కళాకారులు ఇత్తడి, కాంస్యంతో అనేక కళాత్మకమైన వస్తువులను రూపొందించటంలో సిద్ధహస్తులు.

కాకతీయుల కాలం నుండి పెంబర్తి గ్రామం హస్త కళలకు నిలయంగా మారింది. కాకతీయ శైలిని అనుసరించడం వీరి కళ ప్రత్యేకత. మానవ శ్రమ ఆవిష్కరించిన పెంబర్తి కళలు అనేక కళా ఖండాలుగా దేశ విదేశాల్లోవర్థిల్లుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, దేవతల విగ్రహాలను, కళా ఖండాలను, గృహ అలంకరణ వస్తువులను గుడి, బడి మొదలైన అనేక మానవ అవసరమైన హస్త కళా రూపాలను పెంబర్తి కళాకారుల నైపుణ్యంతో తయారు చేస్తారు. ఇక్కడ తయారైన కళాత్మక వస్తువులను అమెరికా, జర్మనీ, బెల్జియం,  జపాన్  దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.

ధ్వజస్తంభ తొడుగులు, గోపుర కలశాలు, కవచాలు రూపొందించడంలో వీరు దిట్ట. లోహాలు, లోహమిశ్రమాలతో కుఢ్యాలంకరణ చేయ డంలో, గీతోపదేశం, దశావతారాలు, అష్టలక్ష్మీ,సీతారామ పట్టాభిషేకం, కాకతీయ కళాతోరణం, చార్మినార్‌, గణేష్‌, లక్ష్మీదేవి,  సరస్వతి, హంస  తదితర సజీవ రూపాలను నివాస కుఢ్యాలపై హృద్యంగా ఆవిష్కరిస్తారు ఇక్కడి కళాకారులు.

 

ఘనపూర్ ఆలయాల సముదాయం

Previous article

పాండవుల గుట్ట

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Telangana