ఈ పేరు వింటేనే అందరికీ గుర్తొచ్చేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి చీరలే. జరీ తయారీలో ఈ పట్టణం ఎంతో పేరుగాంచింది.సున్నితమైన..అందమైన నేత పనికి పోచంపల్లి చీరలు అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. చక్కని నైపుణ్యం ఉన్న నేత కార్మికుల పనితనాన్ని చూస్తే వారి చేతుల్లో ఏదైనా మ్యాజిక్ ఉందా? అని ఆశ్చర్యపోవాల్సిందే.ఇక్కడి ప్రజల్లో ఉన్న ప్రత్యేక పనితనం ఒక తరం నుంచి మరో తరానికి అలా బదిలీ అవుతూ వస్తోంది. ఇఖత్, డై రంగులతో చేసే నేతపనికి కూడా పోచంపల్లి ప్రసిద్ధి చెందింది. డిజైన్లను..రంగులను సమపాళ్లలో రంగరించి వాటిని క్రమపద్దతిలో నేయడం పోచంపల్లి నేతన్నల శైలి. ఇక్కడ చీరల తయారీకి వాడే రంగులు అన్నీ సహజ వనరుల నుంచే తయారు చేస్తారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉంది.

హైదరాబాద్‌కు 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

పానగల్

Previous article

ఫణిగిరి

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Nalgonda