రాచకొండ కోట పర్యాటక ప్రాముఖ్యత గల ప్రదేశం. పట్టాభిగుట్ట దగ్గర ఒక గుహలోపల ‘దశావతార’ శిల్పాలు, పట్టణంలోని ఐదు దేవాలయాలు కాకతీయుల శిల్పకళకు చక్కటి నిదర్శనాలు. రేచర్ల నాయకులు రాచకొండ రాజధానిగా క్రీ.శ.1325 నుండి 1474 వరకు మొత్తం తెలంగాణను పరిపాలించారు. తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఇలాంటి గుహలు 17 ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాచకొండ గుట్టల్లో రెండు రాతి గుహలు వెలుగులోకి వచ్చాయి. చరిత్ర పూర్వయుగానికి చెందిన.. అంటే రాత కనిపెట్టక ముందు కాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో ఆదిమానవులు నివసించే వారనడానికి నిదర్శనంగా వారు వేసిన చిత్రాలు ఈ గుహల్లో ఉన్నాయి. గుర్రాల గుట్ట మీద చాళుక్య యుగం నాటి వైష్ణవాలయం ఉంది. దీనికి సమీపంలోనే పెద్ద రాతి గుండ్ల మధ్య సహజసిద్ధమైన గుహ ఉంది. త్రిభుజాకార ముఖద్వారం ఉన్న ఈ గుహ సుమారు రెండు వందలమంది కూర్చునేంత వైశాల్యంతో ఉంటుంది. గుహలో తూర్పు పడమరలకు సహజ ద్వారాలుండగా ఉత్తర.. పడమర గోడలు ఏటవాలుగా ఉన్నాయి.ఒక పెద్ద గుండుపై మరో బండరాయి పడడంతో ఈ గుహ ఏర్పడింది.ఉత్తరం వైపు చూస్తున్న ఏటవాలు రాతి గోడ ఉపరితలం మీద చిత్రలేఖనాలున్నాయి. తూర్పు నుంచి పడమర వైపు కొనసాగుతున్న ఈ గోడకు మొదట మనుషుల బొమ్మలు కనిపిస్తాయి. తరువాత దీర్ఘ చతురస్రాకారంలో పటం (డిజైన్) బొమ్మ ఉంది. కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా వర్ధిల్లిన రాచకొండ చరిత్రకు సాక్ష్యంగా కొన్ని కట్టడాలు ఇక్కడ దర్శనమిస్తాయి.

భువనగిరి కోట

Previous article

యాదాద్రి

Next article

You may also like

Comments

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

More in Nalgonda