రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణా కేంద్రం. కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. 6.14 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఈ అభయారణ్యాన్ని 1988లో స్థాపించారు. అంతరించిపోతున్న పక్షి జాతులైన బస్టర్డ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇది ఆవాసంగా ఉంది. ఈ అభయారణ్యంలో ఎక్కువగా వేడిగా, పొడిగా వుండి విపరీత వాతావరణ పరిస్థితులు ఉంటాయి. రోళ్లపాడు ప్రధానంగా మిశ్రమ అడవులు, ముళ్ళ పొదలు, పచ్చిక బయళ్ళతో ఉంటుంది.

Rollapadu Wildlife Sanctuaryఈ ప్రాంతంలో పత్తి, పొగాకు, పొద్దుతిరుగుడు వంటి పంటలు సాగు చేసేందుకు అనువైన భూములు ఉన్నాయి. రోళ్లపాడు అభయారణ్యం విభిన్న జంతుజాల జాతులకు నిలయం. ఈ అభయారణ్యంలో నక్కలు, బోనెట్ కోతి, అడవి పిల్లులు, ఎలుగుబంట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ వున్న అల్గనూర్ జలాశయానికి 132 పక్షి జాతులు వలస వస్తుంటాయి. బస్టర్డ్, ఫ్లోర్కాన్ తోపాటు ఇతర పక్షి జాతులకు ఇది నిలయం.

Similar Posts

Recent Posts

International

Share it