సౌండ్ కంటే మూడు రెట్ల స్పీడ్ తో నడిచే ఎయిర్ క్రాఫ్ట్

సౌండ్ కంటే మూడు రెట్ల స్పీడ్ తో నడిచే ఎయిర్ క్రాఫ్ట్

ఈ సూపర్ సోనిక్ విమానం శబ్దం కంటే మూడు రెట్లు వేగంగా ఆకాశంలో దూసుకెళుతుంది. ఈ కొత్త తరహా సూపర్ సోనిక్ విమానానికి సంబంధించిన డిజైన్ ను వర్జిన్ గెలాక్టిక్ తాజాగా ఆవిష్కరించింది. అత్యంత వేగవంతమైన ప్రయాణాల కోసం ఈ సూపర్ సోనిక్ విమానాన్ని రెడీ చేస్తున్నారు. బిలియనీర్ అయిన రిచర్డ్ బ్రాన్సన్ కు చెందిన వర్జిన్ గెలాక్టిక్ ఈ విమానం తయారీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో తొమ్మిది నుంచి పందొమ్మిది ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. అంతే కాకుండా ప్రయాణికులు కోరుకున్న విధంగా బిజినెస్, ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయని వర్జిన్ గెలాక్టిక్ వెల్లడించింది.

ఇది ఏకంగా అరవై వేల అడుగుల ఎత్తులోనూ ప్రయాణించగలదు. ఈ ప్రాజెక్టు కోసం వర్జిన్ రోల్స్ రాయ్స్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మిషన్ కాన్సెప్ట్ రివ్యూను విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం ఈ ఒప్పందం చేసుకున్నారు. ఫెడరల్ ఏవియేషన్ ఆడ్మిస్ట్రేషన్ నుంచి దీనికి ఆమోదం కూడా లభించింది. సురక్షితమైన..అత్యంత వేగవంతమైన ప్రయాణానికి ఈ ప్రాజెక్టు దోహదపడగలదని కంపెనీ చెబుతోంది.

Similar Posts

Recent Posts

International

Share it