థాయ్ ల్యాండ్ లో ఆంక్షలు ఎత్తివేత

థాయ్ ల్యాండ్ లో ఆంక్షలు ఎత్తివేత

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువ మంది సందర్శించే దేశాల్లో థాయ్ ల్యాండ్ ఒకటి. ప్రస్తుతం ఈ దేశంలో కర్ఫ్యూను పూర్తిగా ఎత్తేశారు. గత 21 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవటంతో థాయ్ లాండ్ లో ఆంక్షలు తొలగించారు. అంతే కాదు...హోటళ్ళలో మద్యం సరఫరాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే విదేశీ పర్యాటకులను ఇంకా అనుమతించటం లేదు. దీనికి ఇంకా కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. దేశంలోకి విదేశీ పర్యాటకులను అనుమతించాలా ..వద్దా అనే అంశంపై ఓ ఆన్ లైన్ సర్వే నిర్వహించగా..ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవవద్దని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.

జూన్ 15 నుంచి దేశంలో కరోనా వైరస్ కర్ఫ్యూ ఎత్తేసి పాఠశాలలు కూడా ఓపెన్ చేసేందుకు అనుమతించారు. పబ్స్, బార్స్ మాత్రం ఇంకా మూసివేతలోనే ఉన్నాయి. చైనా తర్వాత తొలి కరోనా కేసు నమోదు అయింది కూడా థాయ్ లాండ్ లోనే. అయినా సరే ఏడు కోట్ల జనాభా గల ఈ దేశం కరోనా నియంత్రించటంలో విజయం సాధించింది. ప్రస్తుతం దేశీయ పర్యాటకులను మాత్రమే ఆయా ప్రాంతాలను సందర్శించాలని ప్రభుత్వం కోరుతోంది.

Similar Posts

Recent Posts

International

Share it