త్రిపురాంతక ఆలయం

త్రిపురాంతక ఆలయం

జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ‘త్రిపురాంతక ఆలయం’ ఒకటి. ఎన్నో విశిష్టతల కేంద్రం ఈ ప్రాంతం. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంతో పాటు బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించిన త్రిపురాసులు అనే రాక్షసులను లోక కళ్యాణం కోసం శివుడు సంహరించాడని చెబుతారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది.ప్రపంచంలోనే శ్రీచక్రంపై నిర్మించిన ఆలయం ఇది ఒక్కటే ఉంది.

స్వామి వారి ఆలయం కొండమీద.. అమ్మవారి ఆలయం కోవెల సమీపంలోని చెరువులో ఉంటుంది. ఇక్కడి ప్రత్యేకత కదంబ చెట్లు. త్రిపురాంతకం,కాశీలో తప్ప ఈ చెట్లు ఎక్కడా కన్పించవని చెబుతారు. శ్రీశైల తూర్పు ద్వారంగా పిలిచే త్రిపురాంతక దేవస్థానాలు శ్రీశైల ఆలయ దత్తత కింద నడుస్తున్నాయి.

Similar Posts

Recent Posts

International

Share it