టైడ

టైడ

ప్రకృతి ప్రేమికులకు ఇదో అద్భుతమై ప్రదేశం. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ.. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రాజెక్టే టైడ. ఇది ఓ ఎకో టూరిజం ప్రాజెక్టు. పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా అడవుల్లో పూర్తి బొంగులతో రిసార్‌్ట్సను నిర్మించారు. ఇది విశాఖపట్నం -అరకు ఘాట్ రోడ్డు మధ్యలో ఉంటుంది. ఈ రిసార్ట్స్ పేరే జంగిల్ బెల్స్. ఈ ప్రాజెక్టు సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ బస చేయడం పర్యాటకులకు ఖచ్చితంగా ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఓ వైపు పచ్చదనం పరుచుకున్న కొండలు.. లోతైన లోయలు.. ఎటుచూసినా చెట్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.అడవిలో ఉన్న ఈ రిసార్‌్ట్సను చేరుకోవటానికి రైలు సౌకర్యం కూడా ఉంది. ఈ ప్రయాణం కూడా ఓ ప్రత్యేక అనుభూతిని మిగుల్చుతుంది. ఈ జంగిల్ బెల్స్ రిసార్ట్స్ మొత్తం ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి.అందులో 18 అద్భుతమైన కాటేజీలు ఉన్నాయి.

వైజాగ్‌ నుంచి 76.4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రిసార్ట్‌ ఫోన్‌ నెంబర్లు: 040–23262151, 90002 82987

Similar Posts

Recent Posts

International

Share it