విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు విడుదల

విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు విడుదల

దేశీయ విమాన సర్వీసులు మే 25 నుంచి ప్రారంభం కానుండటంతో ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రయాణికులు, విమానాశ్రయ నిర్వాహకుల కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్తగా ప్రారంభించే విమాన సర్వీసులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సిబ్బందికి, ప్రయాణికులకు ప్రజా రవాణాతోపాటు, ప్రైవేట్ ట్యాక్సీలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. దీంతోపాటు పలు అంశాలను ప్రస్తావించారు. వాటిలో ముఖ్యమైనవి..

1. ప్రయాణానికి రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి. నాలుగు గంటల తర్వాత ప్రయాణం ఉన్న వారికే మాత్రమే విమానాశ్రయంలోనికి అనుమతిస్తారు.

2.ప్రయాణికులు అందరూ మాస్క్ లు, గ్లోవ్స్ ధరించాలి

3. ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే అనుమతిస్తారు. ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ సిబ్బంది తనిఖీ చేస్తారు. 14 సంవత్సరాల వయస్సులోపు వారికి ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి కాదు.

4.టెర్మినల్ బిల్డింగ్ లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ జోన్ లో నుంచే లోపలికి ప్రవేశించాలి. దీనికి అనుగుణంగా విమానాశ్రయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలి. ఆరోగ్యసేతు యాప్ లో గ్రీన్ చూపించకపోతే ప్రయాణానికి అనుమతించరు.

5. భౌతిక ధూరం పాటించేలా విమానాశ్రయాల్లో సీటింగ్ ఏర్పాట్లు చేయాలి.

6.విమానయాన సంస్థలు చెక్ ఇన్ కౌంటర్ల దగ్గర తగిన సిబ్బందిని నియమించి జాగ్రత్తలు తీసుకోవాలి.

7.టెర్మినల్ బిల్డింగ్, లాంజ్ ల్లో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంచకూడదు.

8.అవకాశం ఉన్న ప్రతి చోటా సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ కాకుండా ఓపెన్ ఎయిర్ వెంటిలేషన్ సౌకర్యాలు వాడాలి.

9. జ్వరం, దగ్గు, ఊరిపి తీసుకోవటం ఇబ్బందిపడుతున్న సిబ్బందిని విధుల్లోకి తీసుకోకూడదు.

10. ప్రయాణికులు విమానంలోకి ఒకేసారి పోకుండా సీటింగ్ నెంబర్ల ప్రకారం లోపలికి పంపించాలి. ఆ సమయంలో గందరగోళానికి తావివ్వకూడదు.

11. లగేజ్ ట్రాలీలను అనుమతించరు. అత్యవసరం అయితే వారు సిబ్బంది అనుమతి తీసుకుని వాడుకోవాల్సి ఉంటుంది.

12. విమానం గమ్యస్థానం చేరిన తర్వాత కూడా ఒకేసారి అందరూ దిగకుండా బ్యాచ్ ల వారీగా ప్రయాణికులను దించాలి.

13. టెర్మినల్ భవనంలోకి లగేజీ వచ్చే సమయంలో విమానాశ్రయ నిర్వాహకులు శానిటైజ్ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Similar Posts

Recent Posts

International

Share it