అలీసాగర్ నిజామాబాద్ జిల్లాలోని ఒక పర్యాటక కేంద్రం. ఇది థనకలాన్ గ్రామంలో ఉంది. దీన్ని నిజాం ప్రభువుల పరిపాలనలో ఏర్పాటు చేశారు.అలీసాగర్ నిజామాబాద్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో నిజామా బాదు-–బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మానవ నిర్మిత జలాశయాన్ని 1930లో కట్టారు. నగర జీవితం హడావిడికి దూరంగా ఈ జలాశయం ప్రశాంత వాతావరణం కల్పిస్తుంది. వన్య ప్రాంతం కల వేసవి విడిది, చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, ఒక దీవి, కొండపైనున్న అతిథిగృహం దీనిని పర్యాటకులకు ఒక ముఖ్య గమ్యస్థానంగా చేస్తున్నాయి. వీటితో పాటు జింకల పార్కు, ట్రెక్కింగ్, జలక్రీడలకు సదుపాయాలు ఉండటం అదనపు ఆకర్షణ. ఇక్కడి ఉద్యానవనం 33ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.
(హరిత హోటల్ సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుంచి 190 కిలోమీటర్ల దూరం)