చంద్రగిరి కోట

Update: 2019-04-27 11:03 GMT

చంద్రగిరి కోటలోని ప్రధాన భవనం, రాజ మహల్. విజయనగర రాజుల చరిత్రలో చంద్రగిరి ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయలు తిరు మలను దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవాడు. అచ్యుత దేవరాయలను ఇక్కడే గృహ నిర్బంధంలో ఉంచారు. క్రీ.శ.1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లిం రాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేశాక విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నేళ్ళ పాటు పెనుకొండకు మార్చారు.పెనుకొండ తర్వాత కొన్ని సంవత్సరాలకు చంద్రగిరికి మారిపోయింది. చంద్రగిరి నుండి పాలించిన చిట్టచివరి విజయనగర రాజు పెద వేంకట రాయలు. ఈయన తన సామంతుడు దామెర్ల చెన్నప్ప నాయకుడు ఆగస్టు 22, 1639లో బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డేకి చెన్నపట్నంలో కోటను కట్టుకోవడానికి అనుమతిచ్చింది ఈ కోట నుండే. ఇప్పటికీ ఆనాటి దస్తావేజులను మ్యూజియంలో చూడవచ్చు. కొండ పైన ఒక సైనిక స్థావరం నిర్మించారు.వారి అవసరాల నిమిత్తం పై భాగాన రెండు చెరువులను నిర్మించి కిందనున్న పెద్ద చెరువు నుండి పైకి నీటిని పంపించేవారని కోటలో మ్యూజియంలోని సమాచారం ద్వారా తెలుస్తున్నది. అప్పుడు పైకి పంపించేందుకు ఉపయోగించిన సాధనాలు పాడైపోయాయి. అయితే పైన చెరువులు, కింద చెరువు ఇప్పటికీ మంచి నీటితో కనిపిస్తాయి.రాణీమహల్ రెండు అంతస్తులు గానూ రాజమహల్ మూడు అంతస్తులుగానూ ఉంది. రాణీ మహల్ చాలావరకు పాడైపోయింది. రాణీ మహల్ అని ఇప్పుడు పిలుస్తున్నారు కానీ దీని వాస్తునుబట్టి ఇది ఒక గుర్రపు శాల కావచ్చని అక్కడి బోర్డుపై రాసిన సమాచారంతో తెలుస్తున్నది. పురావస్తు శాఖ అధీనంలోకి వచ్చాక కొంతవరకూ బాగు చేశారు. రాణీ మహల్ వెనుక కొంచెం దూరంగా కోట నీటి అవసరాలకోసం ఓ దిగుడు బావి ఉంది. దీనినుండే అంతపుర అవసరాలకు నీటిని సరఫరా చేసే వారని తెలుస్తోంది. ఈ బావికి కొద్ది దూరంలో... మరణశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసేందుకు ఆరు స్తంభాలు కలిగి ఉపరితలానికి నాలుగు రింగులు ఉన్న చిన్న మండపం ఉన్నాయి.

చంద్రగిరిలో 164లోకట్టిన కోట ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానంలోని మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వల్ల దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచే వారు. ఇలా నిర్మించటం వల్ల కోట రక్షణ కొండ ప్రాంతంవైపుగా తగ్గగలదనీ, అంతేగాక కొండపైనుండి శత్రువుల కదలికలను దూరంనుండి గమనించటం సులభమని. కోట చుట్టూ దాదాపు కిలో మీటరు దృఢమైన గోడ ఉంది. ఈ గోడ నిర్మించేందుకు వినియోగించిన రాళ్ళ పరిమాణం చాలా పెద్దది. దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తున్నది.ఈ గోడ పొదలు, తుప్పల మధ్య ఇప్పటికీ చెక్కు చెదరక ఉంది. ఈ గోడననుసరిస్తూ బయటి వైపు పెద్ద కందకం ఉంది. ప్రస్తుతం పూడిపోయినా అప్పట్లో ఇందులో మొసళ్ళను పెంచే వారట.రాజమహలులో మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు. ముస్లిం పాలకులు నాశనం చేయగా మిగిలిన శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు ఇందులో ఉన్నాయి. రెండవ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని చూడొచ్చు. మూడవ అంతస్తులో అప్పటి కోట నమూనా, ప్రజలజీవన విధానం లాంటివి ప్రదర్శన కోసం ఉంచారు. ఇదే అంతస్తులో రాజప్రముఖుల గదులు ఉన్నాయి. చాలా వరకూ పాడైన దేవాలయాలు వదిలేసి కొంత బాగున్న రాణీ మహల్, రాజమహలు, వీటివెనుక ఉన్న చెరువు మొదలయిన వాటిని బాగుచేసి, తోట వేసి అన్ని చోట్లా మొక్కలు పెంచి సందర్శకులకు ఆహ్లాదంగా ఉండేలా మార్చారు. రాజమహలుకు వెనుక ఖాళీ ప్రదేశంలో పెద్ద ఓపెన్ థియేటర్ మాదిరిగా మార్చి, దృశ్య కాంతి శబ్ధ (సౌండ్,లైటింగ్ షో) ప్రదర్శన నిర్వహిస్తారు.

https://www.youtube.com/watch?v=hEvx07tkULY

 

 

 

 

 

https://www.youtube.com/watch?v=hEvx07tkULY

Similar News

మంగళగిరి

హాయ్‌లాండ్