డిసర్ట్ సఫారీ, దుబాయ్

Update: 2019-08-02 08:52 GMT

దుబాయ్ లో పర్యటించే టూరిస్ట్ లకు ఓ ఎగ్జైటింగ్ ఈవెంట్ ఈ డిసర్ట్ సఫారీ. ఇసుక గుట్టల్లో కారులో అలా అలా తిరుగుతుంటే ఉండే ఆ కిక్కే వేరు. ఓ వైపు థ్రిల్లింగ్ ఫీల్ తోపాటు మరో వైపు టెన్షన్ కూడా వెంటాడుతుంది. ఎందుకంటే ఎక్కడ తమ కారు పల్టీ కొడుతుందో అన్న భయంతో సఫారీలో పాల్గొనే వారు కారులో హ్యాండిల్స్ ను గట్టిగా పట్టుకుని కూర్చుంటారు. కానీ ప్రమాదాలకు ఏ మాత్రం ఛాన్స్ ఉండదనే చెప్పొచ్చు. ఎందుకంటే అత్యంత సుశిక్షితులైన డ్రైవర్లు మాత్రమే అక్కడ వాహనాలు నడుపుతారు. ఎడారిలో ఈ రైడ్ తర్వాత సాయంత్రం వేళల్లో అక్కడ నుంచి సూర్యాస్తమయాన్ని వీక్షించే వీలు కలుగుతుంది.

కొద్దిసేపు ఆ ఇసుక గుట్టల్లో ఫోటోలు దిగేందుకు అనుమతిస్తారు. అయితే మరీ ఎక్కువ సమయం ఉండదు. దుబాయ్ నుంచి ఓ ప్రత్యేక ప్యాకేజీ కింద డిసర్ట్ సఫారీ టూర్ ఉంటుంది. సఫారీ పూర్తయిన తర్వాత అక్కడ దగ్గరల్లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోటల్ లో డిన్నర్..బెల్లీ డ్యాన్స్ కార్యక్రమం ఉంటుంది. ఇది అంతా నవాబుల కల్చర్ ను ప్రతిబింభించేలా ఏర్పాటు చేస్తారు. అక్కడే చిన్న పిల్లలు..పెద్దలు కూడా ఎడారిలో ఒంటెపై కొద్దిసేపు ప్రయాణం చేయవచ్చు.

https://www.youtube.com/watch?v=UfL20rxbePE

Similar News