ప్రపంచంలో ఏదైనా అతి పెద్ద ఫ్రేమ్ ఉందీ అంటే అది దుబాయ్ ఫ్రేమ్ మాత్రమే. చూడటానికి అది కేవలం అద్దం ఫ్రేమ్ లా ఉన్నా..లోపలికి వెళ్తే కానీ అసలు విషయం అర్ధం కాదు. ఎందుంటే దుబాయ్ ఫ్రేమ్ లో ఎన్నో విశేషాలు ఉంటాయి. ఓ అద్దం ప్రేమ్ ఎలా ఉంటుందో..అచ్చం దుబాయ్ ప్రేమ్ కూడా అలాగే ఉంటుంది. దుబాయ్ ప్రేమ్ లోని నలభైవ అంతస్తులో సందర్శకులను అనుమతిస్తారు. అక్కడ నుంచి దుబాయ్ అందాలను వీక్షించవచ్చు.
నలభై అంతస్థు నుంచి కిందకు చూసే విధంగా లోపల ఓ పెద్ద అద్దాన్ని నిర్మించారు. అక్కడ నుంచి చూస్తే కింద ఏమి జరుగుతుందో స్పష్టంగా కన్పిస్తుంది. ఆ అద్దంపై నడుచుకుంటూ పోయినా ఏమీ కాదు. ఇది సందర్శకులకు ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. కాకపోతే కొంత మంది సందర్శకులు ఆ అద్దంపై నడవటానికి భయపడుతూ ఉంటారు. దుబాయ్ లోని జబీల్ పార్కులో ఈ దుబాయ్ ప్రేమ్ ను ఏర్పాటు చేశారు. ఆర్కిటెక్చిరల్ ల్యాండ్ మార్క్ గా ఉంది. 150 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రేమ్ 2018 జనవరి 1 నుంచి సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది.
దుబాయ్ ఫ్రేమ వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/watch?v=_ivvIl1syHo