సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు ఇది కేంద్రం. ఏడుపాయల కేవలం దేవాలయంగానే కాకుండా..ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా అలరారుతోంది. ఏడుపాయల ప్రాంతం ప్రకృతి అందాలతో శోభిల్లుతూ..పర్యాటకుల సేదతీరుస్తుంది. గలగల పారే మంజీరా నది పాయలు, నిండుగా నీటితో కళకళలాడే ఘనపూర్ ఆనకట్ట, ఎత్తైన రాళ్లగుట్టలు, అబ్బురపరిచే శిలాకృతులు చూపరులను ఆకట్టుకుంటాయి.చుట్టూ కొండలతో ఏడుపాయల ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.వేసవిలో తప్ప..మిగిలిన సమయం అంతా ఈ ప్రాంతం పర్యాటకులతో కిక్కిరిసి ఉంటుంది. మెదక్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో పాపన్నపేట, కొల్చారం మండలాల సరిహద్దులో ఈ ఏడుపాయల ప్రాంతం ఉంటుంది. నదీపాయల పరవళ్లతో ఏడుపాయల సందర్శకులకు మంచి అనుభూతిని మిగుల్చుతుంది.
సందర్శన వేళలు: ఉదయం సోమ నుంచి -శని.
ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ
ఆదివారం. ఉదయం 7.00 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ
ఏడుపాయలలో హరిత హోటల్ సౌకర్యం ఉంది.