. ఎలగందుల్ ఖిల్లా

Update: 2019-04-14 12:01 GMT

కరీంనగర్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత ఉన్న కోటల్లో ఒకటి. ఎల్ గందల్ గ్రామంలో ఈ కోట ఉంది. కాకతీయులు, బహమనీయులు,కుతుబ్ షాహీలు, మెఘల్ లు, అసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఒకప్పుడు ఎల్ గందల్ సర్కారుగా వ్యవహరించిన ఈ గ్రామం1905లో కరీంనగర్ జిల్లా ఏర్పడటంతో అందులో భాగంగా మారిపోయింది.కరీంనగర్‌ నుంచి కామారెడ్డి రహదారిలో. కరీంనగర్‌కు 10 కి.మీ.దూరంలో మానేరు నదీ తీరంలో ఉంది. ఇక్కడి చారిత్రక కొండపై గల కోటలో శ్రీ నరసింహస్వామి ఆలయం ఉంది. గణపతిసేనా నాయకుల్లో ఒకరు నరసింహస్వామి భక్తుడైనందున ఈ కోటలో దేవాలయ ధూప, దీప నైవేద్యాలకు కొంతభూమిని దానం చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇది తెలంగాణ పూర్వ రాజధానిగా చరిత్ర చెబుతోంది. ఈ కోట కాకతీయ,కుతుబ్ షాహీ, మొఘల్, అసఫ్ జాహీ రాజవంశాలకు నెలవు. జఫర్ ఉద్ దౌలాచే క్రీ.శ. 1754లో నిర్మించ బడిన కోట లోపలి మూడు మినార్లు ఊగిసలాడటం వీటి ప్రత్యేకత. మత గురువుల గౌరవార్థం ప్రతి ఏటా వీరి సమాధుల దగ్గర ఉర్సు ఉత్సవం నిర్వహించటం ఆచారం.

సందర్శన వేళలు: ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకూ

హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

 

Similar News

నగునూరు

ధర్మపురి