గాంధీ కొండ

Update: 2019-04-28 13:38 GMT

విజయవాడలోని చారిత్రక ప్రదేశాల్లో గాంధీ హిల్ ఒకటి. నేషనల్ గాంధీ మెమోరి యల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీజీ స్మారక చిహ్నం ఉన్న స్థూపాన్ని నెలకొల్పారు ఇక్కడ. 1965లో ఈ స్థూప నిర్మాణం ప్రారంభం కాగా..1968లో ఇది పూర్తయింది. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దీన్ని ప్రారంభించారు. కొండ పై భాగంలో 52 అడుగుల ఎత్తులో గాంధీ స్మారక స్థూపాన్ని నిర్మించారు. అక్కడే ఓ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో గాంధీ జీవిత చరిత్ర, స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన అనేక విశే షాలతో కూడిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. పర్యాటకుల కోసం నగరం మొత్తాన్ని వీక్షించేలా కొండపై రైలును ఏర్పాటుచేశారు. ఇక్కడ ఉన్న నక్షత్రశాల కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ స్థూపం మహాత్ముని సంస్మరణార్థం దేశంలో నిర్మించిన మొదటి స్తంభం.

Similar News

మంగళగిరి

హాయ్‌లాండ్