ఉస్మాన్ సాగర్ను గండిపేట చెరువు అనికూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇది ఉంది. ఈ చెరువు చుట్టూ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, జలాశయం 29చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. జలాశయం 1,790 అడుగుల లోతు, 3.9 టీఎంసీ సామర్థ్యం కలిగి వుంది. 1908లో హైదరాబాద్ నగరంలో ఉన్న మూసీ నదికి జలప్రళయం వచ్చిన తరువాత హైదరాబాద్ వాసులకు తాగునీటిని అందించడానికి హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ ఆలీ ఖాన్ 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ జలాశయం నిర్మించాడు. ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదుగా ఈ జలాశయానికి ఉస్మాన్ సాగర్‌గా పేరు పెట్టారు. సరస్సుకు ఎదురుగా సాగర్ మహల్ అనే ఒక భవనం ఉంది. చివరి నిజాం తన వేసవి విడిదికోసం ఈ భవనాన్ని నిర్మించాడు. ప్రస్తుతం సాగర్ మహల్ వారసత్వ భవనంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది.