విశాఖపట్నం నగరం మొత్తాన్ని చూడాలంటే కైలాసగిరి కొండ ఎక్కితే సరిపోతుంది. అక్కడ నుంచి సముద్రంతోపాటు చాలావరకూ నగరం కూడా కన్పిస్తుంది. రాత్రి వేళ్లలో అయితే ఇది మరింత సుందరంగా ఉంటుంది. విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇది ఒకటి. కైలాసగిరి కొండపై నుంచి రిషికొండ బీచ్‌తో పాటు.. ఆర్కే బీచ్‌ను వీక్షించొచ్చు. కైలాసగిరిలో అద్భుతమైన పార్కును అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అక్కడ ‘అమరావతి’ పేరుతో ఓ రైలు కూడా నడుస్తోంది. ఈ రైలు ఎక్కితే పార్కుతో పాటు నగరాన్ని చుట్టేసిన అనుభూతి కలుగుతుంది. కైలాసగిరిలో ప్రత్యేక ఆకర్షణగా శివపార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయి. పూర్తి తెల్లని మార్బుల్ తో వీటిని తయారు చేశారు. కైలాసగిరి చేరుకోవటానికి రోప్ వే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
https://www.youtube.com/watch?v=eBN7MTbmHu0