సువిశాలమైన బీచ్.. అందమైన సరుగుడు తోటలు, ప్రాచీన బౌద్ధ కట్టడాలు.. లైట్ హౌస్ శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం ప్రత్యేకతలు.శ్రీకాకుళం జిల్లాలో బంగాళాఖాతం ఒడ్డున ఉన్న అతి ప్రాచీన ఓడరేవు ఇది. రాష్ట్రమంతటా పేరొందిన శ్రీకళాంజలి సాంస్కృతిక సంస్థ కళింగపట్నానిదే. వంశధార నది ఇక్కడే బంగాళా ఖాతంలో కలుస్తుంది.ఇక్కడ హిందువులు, క్రైస్థవులు, ముస్లింల దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. మదీనా సాహెబ్ సమాధి చాలా ముఖ్యమైనది. జిల్లా నలుమూలల నుండి ముస్లింలే కాకుండా హిందువులూ ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఇక్కడి లైట్‌హౌస్‌ను 1876లో ఆంగ్లేయులు కట్టించారు. ఈ లైట్‌హౌస్ జిల్లా కేంద్రం శ్రీకాకుళం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.బస్సులు, కార్లు, ఆటోల ద్వారా కళింగపట్నం వెళ్ళొచ్చు. పాత లైట్ హౌస్1980 వరకు శిథిలమై ఉండేది. శిథిలమైన పాత లైట్‌హౌస్‌ను 1982లో పునర్ నిర్మించారు. పూర్వం ఇక్కడ నుండి సుగంధ ద్రవ్యాలు,ఫెర్ప్యూమ్స్, వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. కళింగపట్నం మంచి పిక్నిక్ స్పాట్‌గా వెలుగొందుతోంది.
జిల్లాకేంద్రం శ్రీకాకుళానికి కళింగపట్నం 25 కి.మీ దూరంలో ఉంది.
బస్, కారు, ఆటో, మొదలైన రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటాయి.