కొలనుపాక

Update: 2019-04-14 10:07 GMT

ఆలేరు మండలంలోని కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవమత స్థాపకుడుగా పూజలందుకుంటున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది వేయి సంవత్సరాలు. భూమండలం మీద శైవ మత ప్రచారం చేసి,మళ్లీ ఇక్కడే లింగైక్యం పొందినట్టు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో రాసి వుందని స్థలపురాణం. దేవాలయ ఆవరణనిండా ఎన్నో శిథిలమైన శాసనాలు, ఛిద్రమైన విగ్రహాలు మనకు కన్పిస్తాయి. దేవాలయ ప్రాంగణాన్ని, ప్రాకార మండపాలనే మ్యూజియంగా ఏర్పాటు చేశారు పురావస్తుశాఖ వారు. ఈ ఆలయం క్రీ.శ 1070 - 1126 మధ్య నిర్మాణం జరిగినట్లు భావిస్తున్నారు. పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించి ఉంటారని చరిత్ర కారులు అంచనా వేస్తున్నారు. ఈ దేవాలయంలోని మూలవిరాట్టు 1.5 మీటర్ల ఎత్తులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. వేల సంఖ్యలో ప్రతినిత్యం భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించుకుంటారు.

హైదరాబాద్ నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar News

ఫణిగిరి