కొండవీడు

Update: 2019-04-30 06:41 GMT

కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా నిర్ణయించింది.ఇక్కడో కందకం (అగడ్త)ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈకందకంలోకి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. ఈ దుర్గానికి రెడ్డిరాజుల కోటగానే గుర్తింపు ఉంది.కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండమీద మూడు చెరువులుంటాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా మిగిలిన రెండు చెరువులలోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపురూప శిల్ప సంపదలున్నాయి.

కొండమీద ఉపయోగించుకునే అవకాశం ఉన్న భూమి విస్తీర్ణం అయిదు చదరపు కిలోమీటర్లు.కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలిచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, మసీదు, ఖజానా వంటివి ఉన్నాయి. ఘాట్‌రోడ్డు కొత్తపాలెం వైపు నుంచి, అయిదో నెంబరు జాతీయ రహదారికి సమీపంలో గల కోట, కొండవీడు గ్రామాల వైపు నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తే మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

 

Similar News

మంగళగిరి

హాయ్‌లాండ్