మొబైల్ ఫోన్ లోనే జపాన్ వీసాలు

Update: 2024-04-07 13:00 GMT

జపాన్ వీసా ఇక ఎంతో ఈజీ. అది కూడా మీ మొబైల్ ఫోన్ కే వచ్చేస్తుంది. భారత్ తో పాటు పలు దేశాలకు జపాన్ ఏప్రిల్ 1 ఎలక్ట్రానిక్ ఈ- వీసా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇక భారత్ పాస్ పోర్ట్ కలిగిన వాళ్ళు తమ ఫిజికల్ పాస్ పోర్ట్ లో వీసా స్టిక్కర్ ను అతికించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ వీసా కోసం విఎఫ్ఎస్ గ్లోబల్ నిర్వహించే జపాన్ వీసా సెంటర్ లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విజిటర్ వీసా తీసుకునే వాళ్ళు 90 రోజులు ఆ దేశంలో పర్యటించడానికి అనుమతిస్తారు. మారిన విధానం ప్రకారం కూడా విఎఫ్ఎస్ గ్లోబల్ నిర్వహించే జపాన్ వీసా సెంటర్ల దరఖాస్తు దారు తన అప్లికేషన్ అందచేయాల్సి ఉంటుంది.

                              అయితే ఇక్కడ కీలక మార్పు ఏంటి అంటే సంప్రదాయ వీసా స్టిక్కర్లు కాకుండా వీసా పొందిన వాళ్లకు మొబైల్ లోనే ఈ వీసా అందుబాటులోకి వస్తుంది. విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు మొబైల్ లో ఉన్న వీసా జారీ నోటీసు ను చూపించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉండటం తప్పని సరి అని స్పష్టం చేశారు. ఒక్క డిజిటల్ రూపంలోని వీసా ను మాత్రమే అనుమతిస్తారు. అంతే తప్ప పీడిఎఫ్స్, ఫోటో లు, స్క్రీన్ షాట్ లు, లేదంటే ప్రింటెడ్ కాపీలను అంగీకరించరు. వీసా ఫీజు ఐదు వందల రూపాయలు మాత్రమే.

వీసా దరఖాస్తు చేసుకునే విధానం

1 . విఎఫ్ఎస్ గ్లోబల్ నిర్వహించే జపాన్ వీసా అప్లికేషన్ అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాలి. అందులో అడిగే బేసిక్ వివరాలు రాయాలి.

2 . పర్యాటకులు టెంపరవరీ విజిటర్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకుని...అన్ని వివరాలు పక్కాగా నింపాలి. తర్వాత ప్రింట్ తీసుకుని ఫోటోలు కూడా సిద్ధం చేసుకోవాలి. దరఖాస్తులో ఉన్న అన్ని కాలమ్స్ పూర్తి చేసింది లేనిదీ తనిఖీ చేసుకోవాలి.

3 . వీసా అప్లికేషన్ సెంటర్ లో పూర్తి చేసిన వీసా అప్లికేషన్ సమర్పించేందుకు అపాయింట్ మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ కన్ ఫర్మ్ అయిన తర్వాత మెయిల్ కు వివరాలు వస్తాయి. అందులో అపాయింట్ మెంట్ లెటర్ కూడా ఉంటుంది.

4 . పూర్తి వివరాలతో నింపిన అప్లికేషన్ ను అపాయింట్ మెంట్ సమయంలో వీసా సెంటర్ లో సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత వీసా వచ్చింది లేనిదీ ఈ మెయిల్ ద్వారా తెలియచేస్తారు. వీసా సెంటర్ లో ఇచ్చే రిసిప్ట్ ఆధారంగా దీన్ని ట్రాక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. వీసా ఓకే అయిన వారికీ ఫిజికల్ వీసా స్టిక్కర్ కాకుండా...మొబైల్ లో ఎలక్ట్రానిక్ వీసా జారీ చేస్తారు . విమానాశ్రయంలో వీసా జారీ నోటీసు ను చూపి లోపలి వెళ్లాల్సి ఉంటుంది.

5 . ఈ- వీసా కింద రెండు డైమెన్షన్స్ లో ఉండే బార్ కోడ్ ను ఇస్తారు. ఎయిర్ పోర్ట్ చెక్ ఇన్ పాయింట్స్ లో మొబైల్ లో ఉన్న వీటిని చూపించాల్సి ఉంటుంది. మన దగ్గర ఉన్న మొబైల్ లో ఉన్న ఈ వీసా ను స్కాన్ చేసి ప్రయాణికులను అనుమతిస్తారు.

6 . అప్లికేషన్ ప్రాసెస్ సమయంలో దరఖాస్తుదారు వ్యక్తిగతంగా వీసా సెంటర్ కు హాజరు కావాల్సి ఉంటుంది.

Tags:    

Similar News