చారిత్రక, పురావస్తు ఆధారంగా చూస్తే అనంతపురం జిల్లాలో లేపాక్షి ఆలయం అత్యంత ముఖ్యమైన ప్రదేశం. లేపాక్షి ఆలయం విజయనగర రాజుల కాలంనాటి ప్రసిద్ధ మురల్ చిత్రాలతో చూపరులను కట్టిపడేస్తుంది.లేపాక్షి ఆలయంలో శివుడు, విష్ణువు, వీరభద్రుడు ప్రధాన దైవాలుగా ఉన్నారు. స్కాందపురాణంలో... భారతదేశంలోని 108 శైవ ఆలయాల్లో ఒకటిగా లేపాక్షిని సూచిస్తుంది. సుందర శిల్పకళ ఉట్టిపడే చిత్రాలతో అలంకృత స్తంభాల మీద నిలువెత్తు గాయకులు, నృత్యకారిణుల శిల్పాలు అనేక ఆకృతులలో చెక్కబడి ఈ ఆలయం చూపరులకు మానసికోల్లాసం,శక్తి కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న నంది ప్రపంచ ప్రసిద్ధి చెందినది. అతి పెద్దది కూడా. (రాతితో చెక్కిన ఈ నంది శివుడికి వాహనం, ద్వారపాలకుడుగా ఉంటుంది). లేపాక్షి చిహ్నాలు విజయనగర శైలి ఆర్కిటెక్చర్‌కు అద్దంపడతాయి.
అనంతపురం నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిందుపూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.