మంత్రాలయం

Update: 2019-04-28 13:06 GMT

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం ఇది. తుంగభద్రా నదీతీరంలో ఉంది. రాఘవేంద్రస్వామి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం.ఇది కర్నూలు నుండి 100 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖ ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-–1671), హిందూ మత ప్రముఖ గురువు. 16వ శతాబ్దంలో జీవించారు.

ఆయన వైష్ణవాన్ని ఆచరించారు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఆయన శిష్యగణం రాఘవేంద్రుడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఆయన శ్రీమూల రాముడి, శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) పరమ భక్తుడు. రాఘవేంద్రుడు పంచముఖిలో తపస్సు చేశారు. ఇక్కడి హనుమంతుణ్ణి దర్శించారు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. ఇక్కడే సజీవ సమాధి అయ్యారు.

 

Similar News

మంగళగిరి

హాయ్‌లాండ్