మారేడుమిల్లి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం. ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని జలతరంగిణి,స్వర్ణధార, అమృతధార జలపాతాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి. ఇక్కడి అటవీ ప్రాంతంలోని జంతువులు...వింతలు చూడటానికి రెండుకళ్ళూ చాలవంటారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా రెండు రిసార్‌్టలు నడుపుతోంది. జలపాతాల వీక్షణతో పాటు అక్కడి నందనవనం ప్రాంతాన్ని దర్శించుకోవచ్చు. అక్కడే బేంబూ చికెన్ రుచి చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఔషధ మొక్కలు కూడా పర్యాటకులకు దర్శనమిస్తాయి.
వనవిహారి రిసార్ట్ నెంబర్: 94941 51617