కృష్ణా జిల్లాలోని మోపిదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్థలపురాణం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని మూలమూర్తి స్వయంభులింగం. వీరారపు పర్వ తాలు అనే కుమ్మరి శివభక్తుని భక్తికి మెచ్చి శివుడు కలలో కనిపించి మోపిదేవి గ్రామంలోని చీమల పుట్టను తవ్వి తన లింగాన్ని బయల్పరచాలని ఆదేశించాడు. పర్వతాలు తన కల గురించి గ్రామస్థులకు తెలియజేసి కలలో కనిపించిన ప్రదేశంలో చీమలపుట్టను తవ్వాడు. బయల్పడిన లింగాన్ని ఆ చీమలపుట్టపైనే ప్రతిష్ఠించి గ్రామస్థులు పూజించడం ప్రారంభించారు. పర్వతాలు గుఱ్ఱము,నంది, కోడి, గరుత్మంతుని విగ్రహాలను బంకమన్నుతో తయారు చేశాడు.మహాఋషుల విగ్రహాలను కూడా బంకమన్నుతో తయారుచేసి బట్టిలో కాల్చి కలకాలం చెక్కుచెదరకుండా తీర్చిదిద్దాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చల్లపల్లి జమిందారీ కుటుంబం ఇలవేల్పు.
విజయవాడకు 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.